
వీధి కుక్కల సంఖ్యను తగ్గించుటకు మార్గం సుగమం
( పయనించే సూర్యుడు మే 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు షాద్ నగర్ పట్టణంలోని సి.ఎస్.కె విల్లాస్ వెనకాల మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద 30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు ప్రారంభించారు. దీంతో ప్రజలకు ముప్పుగా మారిన వీధి కుక్కల సంఖ్యను తగ్గించవచ్చు.ఈ కేంద్రంలో వీధి కుక్కలతో పాటు పెంపు డు కుక్కలు, ఇతర జంతువులకు జనన నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, నేతలు అగ్గనూర్ బస్వo, రఘు, చెంది తిరుపతి రెడ్డి, కృష్ణ రెడ్డి, జృమద్ ఖాన్,ఇబ్రహీం, కొప్పునూరి ప్రవీణ్, తుపాకుల శేఖర్,సీతారాం,మాధువలు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
