
పయనించే సూర్యుడు, జనవరి 31, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :
జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాది…శ్రీ బెజవాడ బిక్షమయ్య పై పోలీస్ ల అక్రమ చర్యలను ఖండిస్తూ అదే విధంగా బంటుమిల్లి లో న్యాయవాదిపై పోలీస్ ల దురుసు ప్రవర్తనను నిరసిస్తూజగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నెపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ది. 31-01-25 న కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా న్యాయవాదులు మాట్లాడుతూ పోలీస్ ల అక్రమ చర్యలను ముక్తఖంఠంతో ఖండించారు.ఈ కార్యక్రమంలో అన్నెపాగ సుందరరావు,యర్రమాస్ ధనుంజయుడు, గోనెల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్, జంగా నరసరాజు, ఆంజనేయులు, పూల నాగరాజు, కిషోర్, అశోక్ , నరేష్, చిన్న గాంధీ, అంకమ్మ రాజు, రవి,రాజశేఖర్,బూడిద నరసింహరావు, గురువుల రాజు, శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు..