
పయనించే సూర్యుడు. జనవరి 30. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ భావుసింగ్ నాయక్
3వ జిల్లా ప్లీనరిని జయప్రదం చేయండి. : 02.03.2025 సమయం: ఉ॥ 11-00 గం॥లకు స్థలం: అంబేద్కర్ భవన్, గొరిల్లా పార్క్ ఎదురుగా, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లా ప్రజలారా! తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పడి 7 సంవత్సరాల కాలం పూర్తి అయింది. ప్రొఫెసర్ యం. కోదండరాం సారధ్యంలో ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరిని జయప్రదంకై ఆర్థికంగా, హార్థికంగా సహకారం అందించి జయప్రదం చేయగలరని కోరుచున్నాము. జిల్లా వ్యాప్తంగా 500 మంది ఎంపిక చేసిన ప్రతినిధులతో జరుగు ప్లీనరిని జయప్రదం చేయాలని కోరుచున్నాము. 2014లో ఏర్పడిన అప్పటి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలు అయిన నిధులు, నియామకాలు, నీళ్ళను పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు. ఆత్మగౌరవం లేకుండా రాజరిక పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాంగా తెలంగాణ గొంతుకగా ఏర్పడినది తెలంగాణ జనసమితి. ఈ యొక్క జనసమితి పార్టీ సామాజిక తెలంగాణ సాధనకై కృషిచేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఈ ఏడు సంవత్సరాల కాలంలో రైతాంగ ఉద్యమాలకు మద్దతుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడింది. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కావాలని విద్యార్థిని, విద్యార్థులు నిరుద్యోగులు చేసిన ఆందోళనకు మద్దతుగా నిలబడి జిల్లాలో అన్ని విద్యాలయాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆందోళనలో త్రిప్పిచూడుముభాగస్వామ్యం అయింది. వర్షాకాలంలో వర్షం వలన వచ్చిన వరదల కారణంగా మునిగిన పొలాలు, ఇండ్లను మరియు సరుకులు, బట్టలతో సహా ఏర్పడిన విపత్తుకర పరిస్థితులలో స్వచ్ఛంద సంస్థల సహకారంలో వారికి అండగా వుండి చేయూతను ఇవ్వటంలో ముందు భాగాన నిలిచింది తెలంగాణ జనసమితి పార్టీ. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమబోర్డు కోసం వారికి 250 గజాల ఇండ్ల స్థలం మరియు ఇండ్లు నిర్మించేందుకు 10 లక్షల నగదు 25 వేలు పెన్షన్ సాధించేందుకు ఆందోళన నిర్వహిస్తూంది. సాధనకు కృషి చేస్తుంది. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమాలు నిర్వహిస్తూంది. సామాజిక తెలంగాణ సాధించేందుకు ఉద్యమాలను నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల యొక్క నిధులు, నియామకాలు, నీళ్లు సాధించేందుకు ఉద్యమాలను నిర్వహిస్తుంది. జిల్లాలోని నిరుద్యోగుల విద్యార్థిని, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం చూపించే సంఘం యొక్క నిర్మాణమును ఏర్పాటు చేసుకుంటుంది. వివిధ విభాగాలల్లో పనిచేస్తున్న కార్మికులను సమీకరించి కార్మికసంఘం యొక్క నిర్మాణం ఏర్పాటు చేయటం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్లీనరిని అన్ని రకాల ప్రజలు పాల్గొని, జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో గోపగాని శంకర్రావు వడ్డే బోయిన బాబు
వెళ్లి నరసింహారావు మోహన్
వినోద్ తదితరులు పాల్గొన్నారు