
పయనించే సూర్యుడు మార్చి 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు.మొత్తం యాబై మంది మావోయిస్టులు 14 మంది తలలపై ఆరవై ఎనిమిది లక్షల రివార్డు ఉన్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు.ప్రధాని మోడీ ఆదివారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. యాబై మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపో యారు. శనివారం సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం వంద మందికిపైగా మావోయి స్టులు చనిపోయారు. అయితే ఆదివారం ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ మధ్య మావోయిస్టులకు వరుస దెబ్బలు ఎదురవు తున్నాయి. ఈ నేపథ్యంలో అనూ హ్యంగా యాబై మంది మావో యిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇందులో 14 మంది మావోయిస్టులపై రూ.ఆరవైఎనిమిది లక్షల రివార్డ్స్ ఉన్నాయి. ఉద్యమంలో ఏర్పడిన విభేదాలలు కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్రకుమా ర్ యాదవ్, వెల్లడించారు. మావోలు సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని ఆయన తెలిపారు.ఆయుధాలు అప్పగించి నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఉద్యమం విడిచిపెట్టి ప్రజా స్రవంతిలోకి వచ్చే మావోలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.