Sunday, February 2, 2025
Homeఆంధ్రప్రదేశ్జమ్మికుంట గాంధీ చౌరస్తాలో వెయ్యి గొంతులు లక్ష డప్పులు వాల్పోస్టర్ ఆవిష్కరణ...

జమ్మికుంట గాంధీ చౌరస్తాలో వెయ్యి గొంతులు లక్ష డప్పులు వాల్పోస్టర్ ఆవిష్కరణ…

Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి 2 //జమ్మికుంట //కుమార్ యాదవ్..
ఎమ్మార్పీఎస్ ఫౌండర్ అధ్యక్షులు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7 నాడు హైదరాబాదులో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన పోస్టర్ మండల ప్రధాన కార్యదర్శి 1000 గొంతులు లక్షప్పులు కళా ప్రదర్శన నిర్మాణ కమిటీ వాసాల సారయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి 1000 గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి రామంచ భారత్ హాజరైనారు. రామంచ భారత్ మాట్లాడుతూ..మందా కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ కోసం చేసిన పోరాటం ఫలితంగా అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు ఒకటి 2024 నాడు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా దామాషా ప్రకారం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పునిస్తే ఒకే ఒక్క మాల సామాజిక వర్గం లో ఉన్నటువంటి సంపన్నులు సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు పెట్టరన్నారు.మాదిగ జాతిని సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ని అవమానించిన దానికి నిరసనగా ఫిబ్రవరి 7 తారీఖు నాడు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమంలో కవులు రచయితలు గాయకులు మేధావులు డప్పు కళాబృందాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీఓసి కుల సంఘాలు బీసీఓసి ప్రజా సంఘాల సాంస్కృతిక విభాగాలు సామాజిక మార్పు కోరుకునే ప్రజాస్వామ్యవాదులు ఇంటలెక్చువల్ మేధావులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో వెయ్యి గొంతులు లక్ష డబ్బులు మహాకళా ప్రదర్శన నిర్వహణ కమిటీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆకినపెళ్లి శిరీష-ప్రవీణ్, ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర ఆదిత్య ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బోయిని సమ్మయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆకినపెళ్లి సమన్న, ఈర్ల నాగరాజ్ వైస్ ప్రెసిడెంట్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అంబాల రాజు, మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీరాములు, కళా ప్రదర్శన కరీంనగర్ జిల్లా కార్యదర్శి జీడి మోహన్ జీడి సదానందం, కోడెపాక రక్షిత్ సీనియర్ నాయకులు గుండ్ల గణపతి గంగారపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments