పయనించే సూర్యుడు జనవరి 31 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( టి యు డబ్ల్యూ జె) మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు శంకరపట్నం లో శుక్రవారం నాడు విలేకరులతో మాట్లాడారు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి అయినప్పటికీ సమస్యను పరిష్కరించలేదని ఆయన అన్నారు హుజరాబాద్ జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేపట్టినారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని ఆయన అన్నారు ఇళ్ల స్థలాలు లేక బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలయాపన చేసిందని ఆయన ఆరోపించారు జర్నలిస్టులు 50 శాతం రాయితీ చొప్పున రైల్వే పాసులు అమలు అయదని ఆయన చెప్పారు కరోనాకు ముందు ఈ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిందని ఆయన విమర్శించారు రాయితీని 50% నుంచి 100 శాతానికి పెంచి కుటుంబ సభ్యులకు రైల్వే పాసులు వర్తింప చేయాలని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే పాసు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు బస్సు పాసులు 75% రాయితీతో ప్రస్తుతం రాష్ట్రంలో బస్సు పాసులు అమల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఈ రాయితీ సరిగా అమలు జరగడం లేదని ఆయన ఆరోపించారు డిజిల్ సెన్స్ టోల్గేట్ ఫీజు కూడా జర్నలిస్టులపైనే రుద్దుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు దీనితో 40% వరకు మన మీదే భారం పడుతుందని ఆయన తెలిపారు పూర్తిస్థాయిలో రాయితీని వర్తింపచేయాలని కుటుంబ సభ్యులకు కూడా వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశవైపు ఆలోచించాలని వెంకటస్వామి కోరారు