
కరాటే కుంఫు జాతీయస్థాయి పోటీలు ఖమ్మంలో జరిగాయి. పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్తా విశ్లేషణ.ప్రతిభ ఫిబ్రవరి 2 ఆదివారం ఖమ్మం లో నిర్వహించిన జాతీయ స్థాయి షోటోకాన్ కుంగ్-ఫు& కరాటే ఓపెన్ చాంపియన్ షిప్,-2025 సైదులు కరాటే స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాంపియన్ షిప్ లో కటా విభాగంలో శ్రీనిధి స్కూల్ కి చెందిన ఒకటవ తరగతి కి చదువుతున్న చెరుకు నిరంజన్ ,చెవ్వూరు కనిష్క్, ఐదో తరగతి చదువుతున్న గోదా నిఖిల్ శాస్తా, ప్రథమ స్థానం సాధించారు. సుధాబత్తుల పవణ్ ఉమా మణికంఠ, చెరుకు జయంతికా, చెవ్వూరు తనిష్క్, కే. దుర్గాప్రసాద్, సాయి, ద్వితీయ స్థానం సాధించారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాలకు చెందిన కరస్పాండెంట్ ముత్యాల కిషోర్ బాబు గారు, ప్రిన్సిపల్ వెంకటనారాయణ గారు, హై స్కూల్ ఇంచార్జ్ పిడి సునీల్ గారు, ప్రైమరీ ఇంచార్జ్ పద్మావతి గారు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా కరాటే కోచ్ మరకాల రేవంత్ కు అభినందనలు తెలియజేశారు.