
విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మల్లేపల్లి తిరుపతయ్య)
చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యన భ్యసిస్తున్న వాకా మణిదీప్ రెడ్డి 2025 మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడమే కాకుండా, 2025 లో జరిగిన జేఈఈ మెయిన్స్ లో అఖిల భారత స్థాయిలో వికలాంగుల కోటాలో 3800 ర్యాంకు సాధించడం జరిగింది.
ఈ సందర్భంగా చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం సుకుమార్ మాట్లాడుతూ. మా కళాశాల స్థాపించి 24సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ కళాశాల నుంచి ఏ విద్యార్థి కూడా జేఈఈ మెయిన్స్ లో సీటు సాధించడం జరగలేదని, మణిదీప్ రెడ్డి ద్వారా ఆ కల కూడా నెరవేరిందని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ మణిదీప్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని మా కళాశాల విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. అనంతరం ఇతర అధ్యాపకులు అందరూ మణిదీప్ రెడ్డి అభినందించి, పలు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు