
- పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మొత్తం నియోజవర్గ ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 14 తేదీ ఏప్రిల్ ప్రపంచ మేధావి,
విద్యా ప్రదాత ,
న్యాయ కోవిదుడు
రాజనీతిజ్ఞులు,
సంఘసంస్కర్త,
సామాజిక అణగారిన
వర్గాల ఆశాజ్యోతి
భారత రాజ్యాంగ నిర్మాత,
భారతరత్న
డాక్టర్ బాబాసాహెబ్ - రామన్ గౌడ్
అంబేద్కర్ గారి 134 వ జయంతి ఉత్సవాలను మహాత్మ జ్యోతిరావ్ పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వాటికి ఆంజనేయులు గారు పూలతో నివాళులర్పించి మాట్లాడుతూ దళిత జాతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు అగ్రవర్ణాల దోపిడీ చేతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని బాధలు అనుభవిస్తున్న సమాజంలో జీవిస్తూ తరగతి గదిలోకి రానివ్వకుండా తోటి విద్యార్థులు సామాజికంగా అవహేళనకు గురై ఎన్నో బాధలు అనుభవించి ప్రస్తుత సమాజంలో ఎందరు వ్యతిరేకించినప్పటికీ భారత రాజ్యాంగం ద్వారా శూద్రులకు అతిశూద్రులకు న్యాయం కల్పించిన దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్స్ అందరికీ అమలు అయినావని అలా అమలు అయిన వాళ్లకు రిజర్వేషన్లు తొలగించాలని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు అది ఎంతవరకు న్యాయము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం ని రచించడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శూద్రులు అతి శూద్రులు సామాజిక బహిష్కరణకు, సమ సమాజ స్థాపనలో ఆర్థిక వనరులు లేక క్షీణిస్తున్న సందర్భంలో వారందరికీ సమానయోగ్యత కలగాలంటే సమసమాజ స్థాపన సామాజిక న్యాయం జరిగినప్పుడు మాత్రమే వారికి మేలు చేకూరుతుంది అనే ఉద్దేశంతో రచించాడు అది తెలివని చాలామంది రిజర్వేషన్లపై తప్పుడు సమాచారాన్ని అందిస్తూ నేటి యువతను పెదదోవలు ప ట్టిస్తున్నారు. మనమందరం నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తర్వాత మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రవణ్ కుమార్ నివాళులర్పించి మాట్లాడుతూ నేటి సమాజంలో మహాత్ములు ఉన్నారంటే జ్ఞాన ప్రబోధం చేసిన వారిలో నిమ్నజాతులన్నింటికీ మేలు చేకూరేలా రిజర్వేషన్స్ రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక దర్శనికుడు ఆయన రచించిన రాజ్యాంగమే ఒక వేల లేకపోతే ఈరోజు శూద్రులు అతిశూదులు అనుభవిస్తున్న కొద్ది పాటి రాజ్యాధికారం ఉండేది కాదు. అది గ్రహించని చాలామంది ఈ మహానుభావుడిని విమర్శిస్తుంటారు. దేశం బాగుపడాలంటే సమ సమాజ స్థాపన జరగాలంటే అందరికీ సమాన హోదా దక్కాలి అలాంటప్పుడు మాత్రమే అందరూ ఏకమయే అవకాశముంటుందని కనుక ఇప్పటికైనా యువత ఆలోచించ వల్సిందిగా కోరారు ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుంటీ రఘు కృష్ణ మండల అధ్యక్షుడు రాజు, జకరయ్య, వెంకటేష్, రాజు సార్, బజరంగ్దళ్ రమేష్, భీమేష్ గుంతలి ఆంజనేయులు మంగలి రవికుమార్ ఉప్పరి నర్సింలు ఉప్పరి రాజు నాసిర్ హుస్సేన్ వీరేష్ గుంతలి ప్రవీణ్ కావలి వెంకటేష్ రహమత్ నరసింహులు టెంట్ హౌస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.