Wednesday, January 29, 2025
Homeఆంధ్రప్రదేశ్టీఎస్ టిటిఎఫ్ జూలూరుపాడు మండల అధ్యక్షులు గుగులోత్ సీతారాములు

టీఎస్ టిటిఎఫ్ జూలూరుపాడు మండల అధ్యక్షులు గుగులోత్ సీతారాములు

Listen to this article

పయనించే సూర్యుడు. జనవరి 27. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలోని పిబి ఎం ప్రాథమిక పాఠశాల నందు టీఎస్ టిటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు భూక్య మోహన్ రాథోడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీఎస్ టిటిఎఫ్ నూతన మండల కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్ గారు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా రాములు నాయక్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సిని ప్రకటించాలని కోరడం జరిగింది జీవో ఎంఎస్ నంబర్ .317 బాధితులను న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహాన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా బాబూలాల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్సను అందించాలని, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఒక హెల్త్ బోర్డు ను ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు అవసరమైన చికిత్సలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. టీఎస్ టిటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మోహన్ రాథోడ్ జూలూరుపాడు నూతన మండల కమిటీని ప్రకటించడం జరిగింది. మండల అధ్యక్షుడిగా గుగులోత్ సీతారాములు మండల ప్రధాన కార్యదర్శిగా ధరావత్ హనుమ గారిని, కోశాధికారిగా జర్పల కృష్ణ , మండల గౌరవ అధ్యక్షుడిగా బానోత్ కృష్ణ గారిని, మండల మహిళా అధ్యక్షురాలుగా ధరావత్ స్వరూపారాణి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాణోత్ శ్రీను నాయక్, జిల్లా కార్యదర్శి నేతాజీ గారు, శంకర్, వీరయ్య, గోపాల్, శ్రీను, పెంటయ్య, భిక్షం తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments