
వెంకటాపురం ఎస్సైకి జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం.సాయి వినతి పత్రం అందజేత.
పయనించే సూర్యుడు: మార్చి 28: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.నూగూరు వెంకటాపురం: ములుగు జిల్లా నూగూరు :కటాపురంమండల కేంద్రం వెంకటాపురం తాసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మరికాల z లోని 1970 నుండి ఇప్పటివరకు సమాచార హక్కు చట్టం ప్రకారంగా సమాచారం ఇవ్వాలని రెవెన్యూ డిప్యూటీ తాసిల్దారుకి దరఖాస్తు చేసుకున్నానని మా దగ్గర లేవు ఏం చేసుకుంటావో చేసుకో అనీ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఈ సందర్భంగా గోండ్వన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన డిప్యూటీ తాసిల్దారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని శుక్రవారం వెంకటాపురం ఎస్సై తిరుపతి రావు కి ఫిర్యాదు ఇచ్చినట్టు ఆయన తెలిపారు.సమాచార హక్కు చట్టం ఉల్లంఘించిన వెంకటాపురం డిప్యూటీ తాసిల్దారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1970 నుండి రెవిన్యూ రికార్డులు రెవెన్యూ అధికారులు అమ్ముకున్నారా లేదంటే ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. 1970 నుండి రికార్డు గిరిజనేతరులకు ఎంతకి అమ్ముకున్నారో సమాధానం చెప్పాలని ఆ రికార్డు లేనప్పుడు మరికల z లో 20 ఎకరాలకు ఒక బడా గిరిజనేతరునికి పాస్ బుక్కులు ఎలా చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏజెన్సీ ఏమైనా గిరిజనేతరుల రాజ్యమా అని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా గిరిజన చట్టాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పకడ్బందీగా చట్టాలు అమలు చేయాలని మీడియా సమావేశంలో తెలియజేశారు.