తాండవసులకు బోరు మోటర్ సామాగ్రిని అందజేసిన మురళీ కృష్ణ యాదవ్
మాజీ ఎమ్మెల్యే అంజయ్యకు ధన్యవాదాలు తెలిపిన తండావాసులు
( పయనించే సూర్యుడు జనవరి 14 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
కేశంపేట మండలం కోనాయిపల్లి తండాలో సొంత నిధులతో తండావాసులు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ బోరు మోటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం షాద్ నగర్ భారత రాష్ట్ర సమితి యువ నాయకులు వై. మురళీకృష్ణ యాదవ్ చేతులమీదుగా తండావాసులకు బోరు మోటర్ సామాగ్రిని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు ఆయన తనయుడు మురళీకృష్ణ యాదవ్ కు కూడా తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పదవి ఉన్న లేకపోయినా నిరంతరం ప్రజలకు బాసటగా నిలుస్తామని మురళీకృష్ణ యాదవ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, పీఎసియస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచులు యాదగిరి రావు, వెంకట్ రెడ్డి, వెంకటయ్య, శ్రీశైలం, నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్ నాయకులు జమాల్ ఖాన్, జగన్మోహన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రామకృష్ణ, రాము, హనుమంతు నాయక్, మురళీ, వెంకటేష్, నరేందర్, అసిఫ్, విజయ్, శ్రీకాంత్ తదితరులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.