
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 14 (మధిర నియోజకవర్గం రిపోర్టర్ కోట వెంకట్) మధిర అంబేద్కర్ సెంటర్ నుండి రాయపట్నం సెంటర్ వెళ్తున్న మార్గంలో కుడి పక్కన ఉన్న ఒక బేకరీలో వాళ్ళ వద్ద ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చి చూడగా అది మొత్తం లోపల బూజు పట్టి ఉన్నది పెద్దలు,చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తినే ముందు తయారీ తేదీ మరియు ముగిసిన తేదీ చూసిన తర్వాత కొనడం ,తినటం మంచిదని అభిప్రాయం ఇలాంటి బేకరీలపై ఫుడ్ కంట్రోల్ వారు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేసిన వినియోగదారుడు.