
పయనించే సూర్యుడు జనవరి 18 తిమ్మాపూర్ మండలం… తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.కొత్తపల్లికి చెందిన గోలి చంద్రారెడ్డి(55) అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది