లయన్స్ క్లబ్ ఆఫ్ తిరువూరు , తిరువూరు మండల ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వాహిని ఇంజనీరింగ్ కాలేజీ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది.
పయనించే సూర్యుడు జనవరి 31 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.
లయన్స్ చిగురుపాటి మంజువాణి వరప్రసాద్ లయన్స్ డిస్ట్రిక్ట్ 316డి బ్లడ్ సెంటర్ విజయవాడ నిపుణులు మక్కెన వినోద్ విచ్చేసి రక్తాన్ని సేకరించడం జరిగినది.ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా తిరువూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కుమారి కె. మాధురి. ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేయడం జరిగింది మరియు ఆర్డిఓ ఆఫీస్ సిబ్బంది కళాశాల విద్యార్థిని,విద్యార్థులు మరియు ఆర్యవైశ్య యువకులు రక్తదానం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వరరావు మండల ఆర్యవైశ్య అధ్యక్షులు జంగాల మురళీకృష్ణ వాహిని కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు ప్రిన్సిపాల్ రంగ నాగేంద్రబాబు
ఏవో కిషోర్ డాక్టర్ తాళ్లూరు రామకోటేశ్వరావు కంచర్ల ముత్య ప్రసాద్ సంకురాత్రి జనార్ధన రావు కొమ్మినేని రాజేష్ ఖన్నా బొడ్డు ప్రకాశరావు అడుసుమల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావు నాగు బండి రాజేశ్వరరావు కోరుకొండ గంగాధర్ పొన్నగండ్ల రామ సీత మొదలగువారు పాల్గొన్నారు.