
తిరువూరు పట్టణం లో ఢిల్లీ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా తిరువూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పయనించే సూర్యుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ ఈ సందర్భంగా తిరువూరు బోసు బొమ్మ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో తిరువూరు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షురాలు తోట భవాని, తిరువూరు రూరల్ మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి కిసాన్ మోర్చ జిల్లా ఉపాద్యక్షులు కొంగర రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్ల రాంబాబు ఎస్ ఎం సి చైర్మన్ వెంపాటి అబ్రహంమణిరత్నం, సీనియర్ నాయకులు నోముల వెంకటరమణ మునుకుళ్ళ గ్రామం నుండి బిజెపి ఓబిసి మోర్చ నాయకులు వెల్లంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..