
పయనించే సూర్యుడు జనవరి 18హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి.. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారులు,జిల్లా జేఎసి కో కన్వీనర్, బీఎస్పీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు చేప్యాల ప్రభాకర్ ఇటీవల గుండెపోటు తో మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె ఎస్ ఆర్ పరామర్శించారు.వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ప్రభాకర్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులతో ప్రభాకర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.వారి మృతి తీరని లోటు అని.వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు చెప్యాల ప్రకాష్,మాట్ల వెంకటస్వామి,కండే సుధాకర్,కంకల సదానందం,మిడిమల్ల శ్రీనివాస్,దిలీప్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.