
పయనించే సూర్యుడు జనవరి 18 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్… కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కేంద్ర మంత్రివర్యులు రాందాస్ అధవాలేని కలిసి తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో విద్యా వైద్యానికి అధిక నిధులు కేటాయించి అట్టడుగు వర్గాలైన దళిత సంక్షేమానికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రివర్యులకు రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా పోలీస్ బ్యూరో చైర్మన్ కొమ్ముల బాబు రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ టీపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ టీపీసీసీ జాయింట్ సెక్రెటరీ మర్నేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.