దళిత క్రైస్తవ గర్జన భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
రాజ్యాంగ హాక్కుల సాధన సమితి మహబూబ్నగర్ జిల్లా సలహాదారులు మిట్టు టైటాస్,సురేందర్,డేవిడ్
( పయనించే సూర్యుడు జూలై 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )దళిత క్రైస్తవ గర్జన భారీ బహిరంగ సభను జయప్రదం చేయగలరని రాజ్యాంగ హాక్కుల సాధన సమితి మహబూబ్ నగర్ జిల్లా సలహాదారులు మిట్టు టైటాస్, సురేందర్,డేవిడ్ అన్నారు. బుధవారం నాడు షాద్ నగర్ పట్టణంలోని ఎం బి చర్చిలో క్రైస్తవ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17 వతేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని జె జె ఆర్ ఫంక్షన్ హల్ లో ఉదయం 11 గంటలకు నిర్వహించేదళిత క్రైస్తవ గర్జన భారీ బహిరంగ సభను జయప్రదం చేయగలరని వివరించారు.ఐక్యమత్యంతో కలిసి క్రైస్తువులంతా హక్కలు సాధించుకోవాలని తెలిపారు. క్రైస్తవ్యంలోకి మారిన ఎస్సిలకు ఎస్సి హోదా కల్పించాలని అన్నారు. అంతేకాకుండా నిత్యం క్రైస్తవులపైన నిరంతరం జరిగే దాడులను అరికట్టేందుకు చర్యలుతీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సభకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, ఎంపీ మల్లురవి, బిఆరెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్,సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ,ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు దేవయ్య, అభిషేక్ అబ్రహం, స్వామిదాస్, జోసఫ్ ఫ్రాంక్లిన్, తిమోతి,కృష్ణపాల్,ఐజాక్,రవితేజ, మల్లేష్, పీటర్,రవి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.