
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 15: మక్తల్ స్థానిక మక్తల్ లోని ప్రభుత్వ విశ్రాంతి గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లా మానుమదురై ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థి అయ్య స్వామి అనే దళితుడు బుల్లెట్ బండిని నడపటాన్ని జీర్ణించుకోలేకా ఆధిపత్య కులాలకు చెందిన తోటి విద్యార్థులు అతడి చేతులు నరకడం ఒక ఆటవిక చర్య ఇది కుల దురహంకారానికి నిదర్శనమని అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్విరాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం క్రియాశీలక సభ్యులు తల్వార్ నరేష్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో కుల దురహంకారంతో దళిత విద్యార్థి చేతులు నరికిన ఘటనను ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకువచ్చి దళితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్, అంబేద్కర్ యువజన సంఘం ఉప్పరపల్లి అధ్యక్షులు బాలకిష్టయ్య, అంబేద్కర్ యువజన సంఘం,bమక్తల్ క్రియశీలక సభ్యులు తల్వార్ నరేష్, తేజ, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.