
పయనించే సూర్యుడు న్యూస్18 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)… మండల కేంద్రమైన యాడికిలో శనివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు మాట్లాడుతూ “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు” అన్న సూక్తిని మొదటిసారి రాజకీయాలకు పరిచయం చేసిన గొప్ప మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమం వెలుగులు నింపిన మహనీయుడని, బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపిమండల కన్వీనర్ రుద్రమ నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, మాజీ ఎంపీటీసీ దడియాల ఆదినారాయణ తీరంపురం నీలకంఠ, గండికోట లక్ష్మణ్, మధురాజ్, పెయింటర్ విజయ్, సుభహాన్, సెల్ పాయింట్ చాంద్ బాషా, తెలుగుదేశం సీనియర్ నాయకులు వాల్మీకి కృష్ణమూర్తి, ఫైబర్ చందు, ఫిరోజ్, తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.