

పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దిన పత్రిక ప్రరినిది నాగేంద్రబాబు కాలుకురి .. విశ్వావిఖ్యాత నట సార్వభౌములు తెలుగువారి ఆత్మ గౌరవం ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దేవుడు అంటే ఈలా ఉంటాడా ,నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతిని విజయపురిసౌత్ లో కూటమి నేతల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పులిహోర,స్వీట్లను పంపిణీ చేశారు.స్థానిక టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు చౌదరి,డా.ఎన్.బసివిరెడ్డి,మత్యకారుల సంఘం అధ్యక్షుడు అప్పలరాజు,సత్తిబాబు,జనసేన అధ్యక్షుడు రాహుల్,పరమేశ్వరావు,ఘంటా ధనుంజయరావు,ఊరే మార్క్,చంద్రశేఖర్, మస్తాన్,నర్సింహులు, శ్రీను, బాలస్వామి, చరణ్,పవన్,రామ్ చంద్,నూకరాజు,శివ తదితరులు పాల్గొన్నారు