
శేరిలింగంపల్లి,జనవరి 29 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్ )
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద సమస్య ఎక్కువగా ఉంద ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంట మాలజీ సిబ్బందితో కలిసి దోమల నివా రణ కొరకు ఎల్లమ్మ చెరువులో తిమేపాస్ కెమికల్ (దోమల మందు)ను డ్రోన్ యంత్రం సహాయంతో పిచ్చకారి చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు తిమేపాస్ కెమికల్ పిచ్చకారి చేయడం వలన చెరువులో ఉన్నటువంటి దోమ గుడ్లు దోమ పిల్లలను లార్వ దశలోనే అరికట్టవచ్చు అన్నారు. ఎల్లమ్మచెరువు పరిసర ప్రాంతాలలో దోమల సమస్య ఎక్కువగా ఉందని గతంలోనే సంబంధిత అధికారులకు మరియు శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేక పూడి గాంధీ దృష్టికి తీసుకువె ళ్లడం జరిగిందని,వారు కూడా సాను కూలంగా స్పందించారని అన్నారు.ఈ చలి కాలం
లో దోమల బెడద ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే,ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవమే అందుకని నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్న అధికారులను వారి సిబ్బంది ని నిందించడం సరికాదని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల కోసమే పనిచేస్తారు అని గుర్తుచే శారు. ప్రజల ఇబ్బంది నాకు తెలు సునని, నేను కూడా ఇక్కడే జీవిస్తూ బాధితులలో ఒకడిగా ఉన్నాను కాబట్టి దోమల సమ స్య ఎంత తీవ్రంగా ఉందొ నాకు కూడా స్వయానుభవం ఉందని తెలిపారు. త్వరలోనే ఎల్లమ్మచెరువులోని గుర్రపు డెక్కను శుభ్రం చేసి సమస్యను పరిష్క రిస్తామని తెలియచేసారు. కార్యక్రమం
లో గుడ్ల శ్రీనివాస్,ఎంటమాలజి సూప ర్వైజర్ డి.నరసింహులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.