Thursday, January 30, 2025
Homeఆంధ్రప్రదేశ్దోమల సమస్యలపై స్పందనేది.అధికారుల నిర్లక్ష్యం…ప్రజలకు ప్రాణ సంకటం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం.

దోమల సమస్యలపై స్పందనేది.అధికారుల నిర్లక్ష్యం…ప్రజలకు ప్రాణ సంకటం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం.

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 28 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శ్మశానవాటికల పరిశీలనలో ప్రజల సమస్యలపై స్పందించిన ఏమ్మెల్యే
మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ స్మశానవాటికలను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.. ముందుగా బాలానగర్ డివిజన్ చరబండ రాజు కాలనీలోని స్మశానవాటికలను పరిశీలించి అక్కడ మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.. ముఖ్యంగా నీటి సదుపాయం లేదని అలాగే పిచ్చి మొక్కలు అస్తవ్యస్తంగా పెరిగి చాలా ఇబ్బందిగా ఉంటుందని .. ప్రధానంగా దోమల సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు తెలపగా.. వెంటనే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచనలు జారీ చేశారు ,కాంపౌండ్ వాల్ నిర్మించి పరిసరాలను శుభ్రం చేయాలని అలాగే నీటి సదుపాయం కల్పించాలని మూత్రశాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.. అనంతరం వినాయక నగర్ లోని స్మశాన వాటికను పరిశీలించి అక్కడ కూడా మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఎందుకు సరైన నిర్వహణ ఏర్పాట్లు చేయడం లేదని వెంటనే నీటి సదుపాయాలు మౌలిక వసతులు కల్పించి సానిటేషన్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ప్రధానంగా బాలానగర్ లోని నాలా పరిసర ప్రాంతాలు కాలనీలు బస్తీలలో దోమల బెడద ఎక్కువైందని అధిక్కారులు పట్టించుకోవడంలేదని స్థానికుల పిర్యాదుతో స్పందించిన ఎమ్మెలే శానిటేషన్ విభాగం అధికారులను, ఎంటమాలజీ విభాగం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, ఫాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు. దోమలతో ప్రజలు అనారోగ్యం బారినపడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments