
పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా
స్పందించకుంటే డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులతో ఆక్రమిస్తాం
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్.
ధర్పల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందించాలని, లేకపోతే లబ్ధిదారులతో ఆక్రమిస్తాం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి, ఆర్ రమేష్,స్పష్టం చేశారు. శుక్రవారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి అయిపోయిన డబుల్ బెడ్ రూమ్ లాను ఆరుకులకే ఇవ్వాలని ,,తహసీల్దార్ కు వినతిపత్రం . ఈ సందర్బంగా లబ్ధిదారులను ఉద్దేసించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతు: గత కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూములను అట్టహాసంగా ప్రారంభించి పేదవాడి కళ నెరవేరుస్తామని డబ్బా కొట్టుకుని ప్రచారం చేసుకున్నది. కానీ పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందులో భాగంగా ధర్పల్లి మండల కేంద్రంలో పేదప్రజలకు అందించడానికి లక్షల డబ్బులు హేచ్చించి నిర్మాణం చేపట్టారు. ఇక నిరుపేదలు తమ కల నెరవేరుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తే వారికి నిరాశ మిగిలిందని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్రూంలో నిర్మాణం పూర్తయిన “అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు” అన్నట్లుగా అలాట్మెంట్ చేయలేదు అని, నిరుపేదలు అయినా లబ్ధిదారులకు అవి అందించలేదన్నారు. దీనివల్ల డబుల్ బెడ్ రూములు నిర్మించిన నిరుపయోగము అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ నిధులు వృధా అయ్యేవిధంగా ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ లను అర్హులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల గత ప్రభుత్వం వలె నిర్లక్ష్యం వహించకుండా, కాలయాపన చేయకుండా అర్హులైన పేదలకు తక్షణమే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించి అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ చూపి, మానవతా దృక్పథంతో ఆలోచించి నిరుపేదలైన లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని లేదు అంటే లబ్ధిదారులె ఆక్రమనకు పునుకుంటారు అని ఆయన హేచ్చరించారు. కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు స్వరూప,లక్ష్మి, తారు,గంగామణి, తదితరులు పాల్గొన్నారు.