
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ తాడిపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప 17… తాడిపత్రి రూరల్ పోలీసు స్టేషన్ 11/2025 U/s 319 (2), 308 (5) R/w 3 (5) BNS కేసులో ముద్దాయిలు తాడిపత్రి టౌన్ నందలపాడు రైల్వే బ్రిడ్జి దగ్గర ఈ రోజు మధ్యాహ్నం 02.00 గంటలకు తాడిపత్రి రూరల్ ఆఫ్ గ్రేడ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ S.శివ గంగాధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో K.ధరణి బాబు చేత అరెస్టు చేయడమైనదనిముద్దాయిల వివరాలు
యర్రగుంట్ల చిన్న బాబు వయస్సు. 41 సం, తండ్రి. Y.పుష్పరాజ్ రాజారెడ్డి వీధి కడప టౌన్ ప్రస్తుతం నందలపాడు తాడిపత్రి టౌన్.
చిలమకూరు తిమ్మదాసు వయస్సు 39 సం తండ్రి. C.రత్నమయ్య, సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం కడప జిల్లా ప్రస్తుతం తాడిపత్రి టౌన్ నందలపాడు అరెస్టు సమయం లో రెండు ఫేక్ ప్రెస్ ఐడి కార్డ్స్ ముద్దాయిల దగ్గర నుండి స్వాదీన పరుచుకోవడమైనదని
కేసు యొక్క నేపథ్యం పై ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు తాడిపత్రి లోని కొన్ని డాబాలలో వంట మాస్టర్లుగా పనిచేసేవారు వీరిద్దరూ తాగుడుకు బానిస కావడంతో ఏ ఢాబాలలో పని ఇవ్వకపోవడంతో ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయాలని అనుకోని యర్రగుంట్ల చిన్న బాబు ఫోటో పెట్టి పేరు మార్చుకొని నకిలీ HMTV ID కార్డు తయారు చేసుకొని చిలమకూరు తిమ్మదాసు తో కలిసి వెళ్లి నాలుగు నెలల క్రితం తాడిపత్రి మండలం చుక్కలూరు రోడ్లో వున్న బొరుగుల ఫ్యాక్టరీ కి వెళ్లి ప్రెస్ అని చెప్పి డబ్బులు ఇవ్వమని బెదిరించగా ఫ్యాక్టరీ ఓనర్ భయపడి రు.1000 ఇచ్చినాడు అదేవిధముగా పై ఇద్దరు వ్యక్తులు కలసి 16.01.2025 వ తేదిన సాయంత్రం సుమారు 05:00 గంటల సమయంలో నకిలీ HMTV ID కార్డు తయారు చేసుకొని తాడిపత్రిలో చుక్కలూరు రోడ్ లో ఉన్న మల్లికార్జున రెడ్డి బొరుగుల ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ వున్న ఫ్యాక్టరీ యజమానిని డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వను మీరు అసలు ప్రెస్ వారే కాదు, నేను విచారించుకొన్నాను అని చెప్పగా పై ఇద్దరు కలిసి డబ్బులు ఇవ్వకపోతే చంపుతాము అని భయబ్రాంతులకు గురి చేసి అతని వద్ద బలవంతముగా డబ్బులు రు.1000 లను లాక్కున్నారు. దీనిపై నిన్నటి దినం కేసు నమోదు చేసి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కొరకు కోర్టుకి తరలించడమైనది.