
దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులకు సూచించిన చిత్తూరు ఎంపీ
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 4:-రిపోర్టర్ (కే. శివకృష్ణ )
తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా, నగరి మండలం, రామాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.
ఢిల్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆయన.., నగరి నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాద ఘటన పై స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులకు సూచించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. నగరి నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..,బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.