
తిరువూరు:తిరువూరు మండలం, చౌటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలోని 30 స్కూల్స్, 26 అంగన్వాడి సెంటర్లలో ఉన్న పిల్ల లందరికీ డి వార్మింగ్ డే నులిపు రుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కే పూజిత ఆధ్వర్యంలో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగినది. పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్త విశ్లేషణ. చౌటపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం పిల్లల సంఖ్య 23 59 ఈరోజు మాత్రలు తీసుకున్న పిల్లల సంఖ్య 2244 మిగిలిన పిల్లలకు 17వ తారీఖున మాత్రల పంపిణీ చేయడం జరుగుతుంది ఈకార్యక్ర మంలో ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పి లు ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.