త్వరలో వేస్తాం: డివిజన్ ప్రెసిడెంట్ నగేష్ నాయక్.
శేరిలింగంపల్లి.జనవరి 16 పయనించే సూర్యుడు ప్రతినిధి( ఎస్ఎం కుమార్ )
మాదాపూర్ ప్రతినిధి.. పాత కాంగ్రెస్ పార్టీ కమిటీలు రద్దు అయిన కారణంగా నూతనంగా పార్టీ కమిటీ లు వేసే పనిలో నిమగ్నం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పని చేసి క్రియాశీలక పాత్ర పోషించే వారిని మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియామకం చేస్తామని మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. నగేష్ నాయక్ పత్రిక ముఖంగా తెలియజేశారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ సమన్వయం తో పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియ జేశారు.