
ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కృషి అభినందనీయం ..
మఖ్తల్ కాంగ్రెస్ నేతలు…
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి6 మక్తల్ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయంగా డాక్టర్ వాకిటి శ్రీహరి అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందులో భాగంగానే తాజాగా మఖ్తల్ నియోజకవర్గంలో నూతన రోడ్లు, రోడ్ల మరమ్మతుల కోసం 30 కోట్ల 73 లక్షల నిధులు మంజూరు చేయించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… మఖ్తల్ నియోజకవర్గంలో తాజాగా నూతన బీటీ రోడ్ల కోసం 15 కోట్లు, ఇతర చోట్ల రోడ్ల మరమ్మతుల కోసం 15 కోట్ల 73 లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు. నూతన బీటీ రోడ్ల వివరాల్లోకి వెళితే… మాగనూరు మండల పరిధిలో మాగనూరు నుంచి అచ్చంపేట్ వరకు 4 కిలో మీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 3 కోట్ల 80 లక్షలు, క్రిష్ణ మండల పరిధిలో క్రిష్ణ ఘాట్ నుంచి గుర్జాల్ గ్రామానికి 2 కిలో మీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 2 కోట్ల 40 లక్షలు, ఉట్కూర్ మండల పరిధిలో బిజ్వార్ నుంచి కొత్తపల్లి మీదుగా ధన్వాడకు 2 కిలో మీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి కోటి 90 లక్షలు, నర్వ మండల పరిధిలో నర్వ నుంచి జక్కన్న పల్లి గ్రామానికి 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 90 లక్షలు, అమర్ చింత మండల పరిధిలో చంద్రఘడ్ స్టేజి నుంచి నందిమల్ల వరకు 1.85 కిలోమీటర్ల నిర్మాణానికి కోటి 40 లక్షలు, జెడ్పి రోడ్డు నుంచి ధర్మాపూర్ వరకు 2.52 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 2 కోట్లు, ఆత్మకూరు మండల పరిధిలో వీర రాఘవపూర్ నుంచి పామపురం వరకు 0.70 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. మొత్తం నియోజవర్గ పరిధిలో 16.07 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 15 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇక రోడ్ల మరమ్మత్తుల విషయానికొస్తే.. మక్తల్ మండల పరిధిలోని కాచ్ వార్ నుంచి ఎడివెల్లి గ్రామం వరకు 3.60 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు 2 కోట్ల 34 లక్షలు, ముష్టిపల్లి నుంచి అనుగొండ గ్రామం వరకు ఒక కిలోమీటర్ రోడ్ మరమ్మత్తు కోసం 65 లక్షలు, నర్వ మండల పరిధిలో పిడబ్ల్యుడి రోడ్డు నుంచి లంకాల మీదుగా నర్వ వరకు 7 కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తు కోసం 4 కోట్ల 55 లక్షలు, మాగనూరు మండల పరిధిలో కొల్పూరు గ్రామం నుంచి ముడుమాల్ గ్రామం వరకు 4 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తు కోసం 2 కోట్ల 60 లక్షలు, అమరచింత మండల పరిధిలో నందిమల్ల నుంచి మిట్ట నందిమల్ల గ్రామం వరకు 6.80 కిలోమీటర్ల రోడ్డు మనమ్మత్తు కోసం 4 కోట్ల 42 లక్షలు, ఆత్మకూరు మండల పరిధిలోని పిడబ్ల్యుడి రోడ్డు నుంచి మేడిపల్లి వరకు 1.80 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు కోసం కోటి 17 లక్షలు మంజూరయ్యాయని… మొత్తంగా నియోజవర్గ పరిధిలో 24.20 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం 15 కోట్ల 73 లక్షలు మంజూరైనట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. మొత్తం మీద మఖ్తల్ నియోజవర్గ వ్యాప్తంగా దాదాపుగా అన్ని మండలాల్లో నూతన బీటీ రోడ్లు, రోడ్ల మరమ్మతుల కోసం 30 కోట్ల 73 లక్షల రూపాయలను ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి . మంజూరు చేయించారని, కేవలం ఏడాదిలోనే నియోజవర్గంలో రహదారుల కోసం దాదాపు 100 కోట్ల వరకు నిధులను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కి దక్కుతుందని అన్నారు. గతంలో రహదారుల కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఎప్పుడు మంజూరు కాలేదని స్పష్టం చేశారు. నియోజవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలన్నదే ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి . ధ్యేయమని, పదవి కాలం పూర్తయ్యేలోపు ప్రతి గ్రామానికి బిటి రోడ్డు కల్పిస్తామని హామీ ఇచ్చారని, అది నెరవేర్చేదిశగా డాక్టర్ వాకిటి శ్రీహరి .చేపడుతున్న కృషి అభినందనీయమని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, మండలాధ్యక్షుడు గణేష్ , టౌన్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శాలం, సీనియర్ నాయకులు చంద్రకాంత్ గౌడ్, నేతలు నూరుద్దిన్ , శంషుద్దీన్, అస్మొద్దీన్, బోయ నరసింహ, బండారి బాబు తదితరులు పాల్గొన్నారు.