పెద్ద ఎత్తున తరలి రానున్న భక్తులు.
భక్తులకుభారీ ఏర్పాట్లు
.మాచర్ల మండలం టౌన్ పల్నాడుజిల్లా పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దిన పత్రిక ప్రతినిధి నాగేంద్రబాబు కాలుకురి
సర్వ జీవ శ్రేయస్సు_ సర్వలోక శాంతి కొరకు ఆదివారం శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి సత్సంగం ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ గీత యజ్ఞం… కోటి నామోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి సత్సంగ నిర్వాహకులు తెలిపారు. శనివారం కాశీ విశ్వనాథం స్వామి విలేకరులతోమాట్లాడుతూ స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో శ్రీ భగవాన్ గీత యజ్ఞం సందర్భంగా సత్సంగము, కోటి నామోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. “హరే రామ హరే రామ రామ రామ హరే హరే” “హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే”, భక్తి యోగ పారాయణం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉభయ గుంటూరు జిల్లాల నుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంతల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కోటి నామోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కాశీవిశ్వనాథ స్వామి తెలిపారు.