
పయనించే సూర్యుడు జనవరి 29హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో తాజా మాజీ బల్దియా పాలకవర్గ వాకర్ సభ్యులకు బుధవారం ఘనంగా సన్మానం జరిగింది. ముందుగా పురపాలక సంఘం తాజా మాజీ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ దంపతులు కొలిపాక నిర్మల శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు ప్రతాప్ తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పైళ్ళ వెంకటరెడ్డి, ఉజ్మా నూరిన్ ఇమ్రాన్, ముక్క రమేష్, గనిశెట్టి ఉమామహేశ్వర్, కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డిలతో పాటు పురపాలక సంఘము జవాన్ జిల్లా ఉత్తమ అవార్డు పొందిన సందర్భంగా ప్రతాప రాజుకు వాకర్స్ ఆసోసియేషన్ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్కు పురపాలక సంఘం తరఫున పాలకవర్గ సభ్యులు ఎల్లవేళలా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని అదేవిధంగా మళ్ళీ వచ్చే పాలకవర్గం కూడా అందించాలని ఈ సందర్భంగా వాకర్స్ నాయకులు ఆకాంక్షించారు. హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి వాకర్ అసోసియేషన్ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు శిల్పి శ్రీనివాస్, ఎండి మతిన్, మండల యాదగిరి, ఏం రాజేందర్, వేణు తదితరులతో పాటు పీడీ కొన్నె రాజిరెడ్డి, వేల్పుల రత్నంతో పాటు వాకర్స్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.