పదవులు ప్రకటించే వరకు ఎవరి మాటలు నమ్మొద్దు…
- బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ..
రుద్రూర్, అక్టోబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి, రాష్ట్ర అధ్యక్షుల నియామకం తర్వాత ప్రకటించినటువంటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర, జిల్లా కమిటీ నియామకాలు జరిగిన తర్వాత అప్పటివరకు ఉన్న అన్ని పదవులు రద్దు అయినట్లేనని మళ్లీ నూతనంగా నియమించబడిన రాష్ట్ర, జిల్లాల మోర్చాల అధ్యక్షులు నూతన కమిటీలు ఏర్పాటు చేసేంతవరకు ఎవరికీ ఎటువంటి పదవులు లేవని గమనించగలరని జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి తెలియజేయడం జరిగిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రూర్ మండలనికి చెందిన భూషిగం సుధాకర్ గౌడ్ నియోజకవర్గంలో నేను ఓబీసీ ఇందూర్ జిల్లా ఓబీసీ ప్రధానకార్యదర్శిని అని చెప్పుకుంటూ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల, బి ఫారం లు ఇప్పిస్తాను అని అందరికి చెప్పుకుంటూ ప్రలోబ పెడుతున్నాడు అని నాదృష్టికి రావడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఇందూర్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం పైన జిల్లా అధ్యక్షులు స్పందించి అతనికి ఎటువంటి పదవులు ఇందూర్ జిల్లా నుంచి లేవు అతని మాటలు ఎవరు నమ్మొద్దని చెప్పడం జరిగింది. కావున నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎవరు మళ్ళీ పదవులు ప్రకటించే వరకు ఎవరి మాటలు నమ్మొద్దు దయచేసి అందరు గమనించగలరని తెలియజేశారు.