
పయనించే సూర్యుడు(పిబ్రవరి 04) కుప్పం రామకుప్పం మండల ప్రతినిధి:-ప్రవీణ్
* హలో మాదిగ చలో హైదరాబాద్ లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ఈరోజు రామకుప్పంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్.ఎంఎస్పి. సీనియర్ నాయకుడు వెంకటేష్ మాదిగ. మండల అధ్యక్షులు గోవింద మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు…
ఎస్సీ రిజర్వేషన్ల ల వర్గీకరణ లక్ష్య సాధనకై అభినవ అంబేద్కర్ మహాజననేత మన శ్రీ మందకృష్ణ మాదిగ
గత 30 సంవత్సరాలుగా అలపెరుగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిజర్వేషన్లు లు చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉందని తీర్పించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ల వర్గీకరణ చట్టబద్ధతకై వన్ మాన్ కమిషన్ చైర్మన్ ని ఏర్పాటు చేసిందని వన్ మాన్ కమిషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు తిరిగి మాదిగ.
మాదిగ ఉప కులాల స్థితిగతులు పై విజ్ఞప్తి లను స్వీకరించిందని ఈ నేపథ్యంలో మన అధినేత మాదిగ మాదిగ ఉప కులాల వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా…. ఫిబ్రవరి 7 నా హైదరాబాదు కేంద్రంగా లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామాల్లోని ప్రతి ఇంటి నుండి డప్పు తీసుకొని రావాలని పిలుపునిఇచ్చారు…. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాదిగ. కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజకుమార్ మాదిగ. ఎమ్మార్పీఎస్.మాజీ మండల అధ్యక్షుడు రామకృష్ణ. మండల ప్రధాన కార్యదర్శి జయప్ప. పాపన్న మాదిగ. ఉదయ్ కుమార్. జీడిగుడ్లు వెంకటేష్. వెంకట్ స్వామి. జయశంకర్. శంకర్ గణేష్. అమర్. జంబప్ప. అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.