
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19. పలాస నియోజకవర్గము ప్రతినిధి రత్నాల రమేష్. పరిశుభ్రమైన వాతావరణం ద్వారానే ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు,మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ అన్నారు. శనివారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు ప్రజలు, ఇతర సిబ్బందితో కలిసి పూండి గల ఆయుర్వేదిక్ హాస్పిటల్, సచివాలయం,అంగన్వాడి తదితర ప్రాంతాల్లో జంగల్ క్లియరెన్స్,కాలువల్లో పూడిక తీతలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ శ్రీను, లావేటి శంకర్, పాలిన చంద్రయ్య, పాలిన మోహన్ రావు, రత్నాల తుంభనాదం, దుర్యోధన, రాజు, సూరి, అప్పలస్వామి, కామేష్, చెంచు , నరేష్, వెంకట్ రావు, రెడ్డి మరియు సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నార