
పయనించే సూర్యడు సిహెచ్.విద్యా సాగర్ జనవరి:-29
దేవీపట్నం మండలం
1/70 చట్టం జోలికి వస్తే ఖబడ్దార్.
స్పీకర్ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలి.ఆదివాసీ జేఏసీ డిమాండ్.
విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుదారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 చట్టంపై సడలింపులు చేయాలని చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనుకకు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వానికి ఆదివాసీల పట్ల చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో అరకులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,పాల కొండ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు జీఓ నెంబర్.3 ను పునర్ధరించి ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని డిమాండ్ చేశారు.కానీ స్పీకర్ స్థాయిలో ఉండి రాజకీయాలలో అపార అనుభవం ఉండి ఆదివాసీల గుండె కాయల్లాంటి 1/70 చట్టంను సడలించాలని చేసిన వ్యాఖ్యలు చేయటం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.స్పీకర్ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే రాష్ట్రం లో ఉన్న అదివాసులందరం ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.