Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు...... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు…… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Listen to this article

పయనించే సూర్యుడు. జనవరి 30. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
* ఖమ్మం టూరిజంకు బ్రాండింగ్ వచ్చేలా నూతన లోగో, ట్యాగ్ లైన్ తయారి

* జమలాపురం వద్ద అటవీ పార్క్, కాటేజి పనులు పూర్తి చేయాలి

* పాలేరు లేక్ వద్ద పర్యాటకులు పెరిగేలా చర్యలు చేపట్టాలి

* పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి సమీక్షించారు.
నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా, పులిగుండాల ప్రాజెక్ట్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ వంటి పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికల గురించి, ఎకో టూరిజంపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు.
జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల వద్ద తలపెట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ జిల్లా అటవీ అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పర్యాటకంగా జిల్లా అభివృద్ధికి, ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద 40 ఫీట్ల రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్కింగ్ ఏరియా ఉండాలని, లోపల ఎటువంటి ప్లాస్టిక్ అనుమతించడానికి వీలులేదని అన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని, లోపల క్యాంటీన్ లో కూడా ప్లాస్టిక్ ఉండవద్దని అన్నారు.
వెలుగు మట్ల అర్బన్ పార్క్ లో చిన్న పిల్లల ప్లే ఏరియా, బోటింగ్ ఏరియా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. పార్క్ లోపల రోడ్డు నిర్మాణం చేయాలని అన్నారు. పులిగొండలో క్యాంప్ సైట్ క్రియేట్ చేసుకునే విధంగా పనులు పూర్తి చేసి ఏకో టూరిజం ట్రిప్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.
వెలుగుమట్ల అర్బన్ పార్క్, పులిగొండ పర్యాటక ప్రాంతాల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వీటికి వచ్చే మార్గాలను వివరిస్తూ కూడా బోర్డులు ఏర్పాటు చేయాలని, విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఖమ్మం జిల్లా పర్యాటక ప్రాంతాలు, ఎకో టూరిజం కు బ్రాండింగ్ వచ్చేలా నూతన లోగో, ట్యాగ్ లైన్ తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
పాలేరు లేక్ వద్ద పిక్నిక్ స్పాట్ అభివృద్ధి చేయాలని, ఇక్కడ ప్రజలు అధికంగా వచ్చేలా జాతీయ రహదారి దగ్గర ప్రచార హోర్డింగులు ఏర్పాటు కావాలని అన్నారు. పాలేరు లేక్ వద్ద బోటింగ్, క్యాంటీన్, పిక్నిక్ స్పాట్, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, బర్డ్ వాచింగ్ సౌకర్యం సిద్ధం చేయాలని, దీని నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ‌
ప్రతి పర్యాటక ప్రాంతం వద్ద టాయిలెట్స్ శుభ్రంగా మెయింటేన్ చేయాలని అన్నారు. పురావస్తు శాఖ పరిధిలో ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని, సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఖమ్మం ఖిల్లా వద్ద రోప్ వే నిర్మాణ పనులకు ప్రజలతో చర్చించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రోప్ వే కు 500 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఏరియాను గుర్తించాలని అన్నారు. ఖమ్మం ఖిల్లా వద్ద పురావస్తు శాఖ సమన్వయంతో ముందుగా అవసరమైన మరమత్తులు చేపట్టి పర్యాటకులను ఆకర్షించాలని, స్కూల్ విద్యార్థులు, జర్నలిస్టులు, జిల్లా అధికారులతో ఖిల్లాకు హిస్టరీ వాక్ ప్లాన్ చేసుకోవాలని, జాఫర్ బావి వద్ద మార్చి నెలలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, టూరిజం జిల్లా అధికారి సుమన్ చక్రవర్తి, ఇరిగేషన్, దేవాదాయ, అటవీ, రెవిన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments