పలు వినాయకుని మండపాలను సందర్శించిన మానాల మోహన్ రెడ్డి.

September 21, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.21.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ మండలంలో ఇత్వర్ పేట్, జలాల్పూర్, కిసాన్ నగర్ మరియు బాల్కొండ గ్రామాలలో వినాయకుడి మండపాలను సందర్శించిన మాజీ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఇతర పేటలో అంబేద్కర్ యువజన సంఘం వద్ద జలాల్పూర్ లో అంబేద్కర్ యువజన సంఘం వద్ద కిసాన్ నగర్ శివాలయం యూత్ వద్ద బాల్కొండలో AB యూత్,హిందూస్ పవర్ యూత్,మౌటైన్ పవర్ యూత్, రైజర్స్ యూత్ ల వద్ద వినాయకుని దర్శించుకోని పూజా కార్యక్రమలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రైతులందరూ పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరారు. వినాయకు ని మండపల సభ్యులకు వినాయకుని నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల ప్రెసిడెంట్ ప్రవీణ్ వెంకటేష్ గౌడ్ సర్పంచ్ మోహన్ రెడ్డి సర్పంచ్ సంతోష్ ప్రవీణ్ గౌడ్ గారు కిషన్ గంగాధర్ సంజీవ్ వాజిద్ రవి తౌడు గంగాధర్ శ్రీను కపిల్ నగేష్ యుసిప్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper