
పయనించే సూర్యుడు మార్చి 31 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు : ఇల్లందుపవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు, ఇల్లందు ఐతా వారి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యహాజరయ్యారు ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈద్ ముబారక్ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆశించారు అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు ముస్లిం సాంప్రదాయం ప్రకారం టోపీ ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు వడ్డించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఇల్లందు డిఎస్పి చంద్రభాను తాసిల్దార్ కె రవికుమార్ , ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ , మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాజీ చైర్మన్ డివి మాజీ వైస్ చైర్మన్ జానీ పాషా నియోజకవర్గ నాయకులు మండల రాము,మడుగు సాంబమూర్తి, కాకాటి భార్గవ్,బొల్లా సూర్యం, చిల్ల శ్రీనివాసరావు,డి శివ, ఉల్లింగ సతీష్, మున్నాభాయ్, హిమాం, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు