
అక్రమ మద్యం స్థావరాలపై పోలీసుల దండయాత్ర
పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (17: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
నాటు సారాయి తయారీ బట్టీల ద్వంశం మరియు ముద్దాయి ల అరెస్టు
ఆదోని టౌన్ లోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న 04 ముద్దాయిల ను అరెస్టు చేసి 30 లీటర్ల నాటుసారాయి పట్టివేత మరియు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసిన సీఐశ్రీ రామ్, ఆదోని 1 టౌన్ పిఎస్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆదోని ఎస్ డి పి ఓ అయిన డి. సోమన్న వారి పర్యవేక్షణలో ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన కె. శ్రీ రామ్ మరియు వారి సిబ్బంది 16.01.2025 వ తేదీన ఆదోని టౌన్ లోని యెల్లమ్మ కొండలలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న 04 వ్యక్తులను గుర్తించగా ఒక మగ వ్యక్తి పారిపోగా 02 మగ వ్యక్తులను మరియు ఒక ఆడ మనిషిని ని అరెస్టు చేసి వారి నుంచి 30 లీటర్ల నాటు సారాయి ని మరియు హీరో కంపెనీకి చెందిన స్కూటీ ని స్వాదీనములోనికి తీసుకుని 05 ప్లాస్టిక్ డ్రమ్ములలో గల సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ద్వంశం చేసి కేసు నమోదు చేయడమైనది. పారిపోయిన మగ వ్యక్తిని గుర్తించడమైనది. అరెస్టు కాబడిన ఇద్దరు మగ వ్యక్తులను మరియు ఒక ఆడ మనిషిని రేపు అనగా 17.01.2025 వ తేదీన రిమాండుకు పంపడం జరుగుతుంది. ముద్దాయిల వివరాలు :-
A-1. బోయ సురేష్, వయస్సు: 35 సంవత్సరాలు, S/o లేట్ B. విజయ్
A-2. సంగ్రామ్ హబీబ్ బాష, వయస్సు 45 సంవత్సరాలు, S/o లేట్ అబ్దుల్ సలాం
A-3. బోయ అనిత, వయస్సు 32 సంవత్సరాలు, W/o బోయ నాగిరెడ్డి
A-4. బోయ వెంకటేష్ @ R F, S/0 లేట్ బోయ విజయ్ (పారిపోయిన ముద్దాయి)