టీడీపీ మాజీ ఇంచార్జ్ గుడిసె అదికృష్ణమ్మ హర్షం వేక్తం చేశారు
_కర్నూల్లో హైకోర్టు బెంచ్ కు సన్నాహాలు..
_
పయనించే సూర్యుడు “ఫిబ్రవరి 1, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి
కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నోహా లు చేస్తున్నట్లు టీడీపీ మాజీ ఇంచార్జ్ గుడిసె అదికృష్ణమ్మా తెలుగుదేశం బీసీసీల్ నాయకుడు వడ్డెమన్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణమ్మా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐ.టి విద్యాశాఖ మంత్రినారా లోకేష్ బాబు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెంచ్ ఏర్పాటు కోసం మొదట రాష్ట్ర మంత్రిమండలిలో ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారన్నారు. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కాంపిటెంట్ అథారిటీ (హైకోర్టు న్యాయమూర్తులు-ఫుల్ కోర్ట్) ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని గతేడాది అక్టోబరు 28 నే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ రాశారని, దానికి స్పందనగానే ఇప్పుడు 15 మంది న్యాయ మూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందచేయమని హైకోర్టు రిజిస్ట్రార్ అడిగారన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ వేగం అందుకొని ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిబద్దత పాటించిందని ఆమె అన్నారు.