
* భావోద్వేగాలతో మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు
* కౌన్సిలర్లకు సన్మానించి మెమొంటోలు అందజేసిన ఎమ్మెల్యే
ప్రయాణించే సూర్యుడు పెద్దవూర మండల ప్రతినిధి జనవరి 30
ప్రజలకు జవాబుదారీగా బాధ్యతలు నిర్వర్తించి,సంతృప్తితో కొందరు కౌన్సిల్ సభ్యులు,అసంతృప్తితో మరి కొందరు వీడ్కోలు సన్మాన కార్యక్రమం,నందికొండ మున్సిపల్ పాలకమండలి పదవి కాలం ముగియడంతో బుధవారం మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను అధ్యక్షతన వీడ్కోలు ఆత్మీయ సన్మాన సమావేశాన్ని నిర్వహించారు.ఈ వీడ్కోలు ఆత్మీయ సభకు ముఖ్యఅతిథిగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలకు తమ వంతు సేవలు అందించిన కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నందికొండ మున్సిపాలిటీకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.మున్సిపాలిటీకి ఎన్.ఆర్.జి.ఐ ఫండ్స్ వచ్చే అవకాశం లేనందున ముఖ్యమంత్రితో చర్చించి దాన్ని వచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దామని అన్నారు.మా నాన్న జానారెడ్డి సాగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు.నాగార్జున సాగర్ లో విద్యుత్ సమస్య లేకుండా నలభై సంవత్సరాలుగా అనేక సేవలు అందించారు,నన్ను నాగార్జునసాగర్ లో అత్యధిక మెజార్టీ తో గెలిపించినందుకు సాగర్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అందుకు తగిన విధంగా నేను సాగర్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.అనంతరం కౌన్సిలర్లకు సాలువాతో సన్మానించి మెమొంటోలు అందజేశారు,ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలకు తమ వంతు సేవలు అందించమని,వారికి సహాయ సహకారాలు అందించిన అధికారులకు,నాయకులకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుమకొండ అన్నపూర్ణ,తిరుమల కొండ మోహన్ రావు, ఆదాసు నాగమణి,మంగుతా నాయక్,నాగ శిరీష,రఘువీర్,రమేజి,నిమ్మల ఇందిరా,ఇర్ల రామకృష్ణ,ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి శాలువాలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, హాలియా వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ తుమ్మల పల్లి శేఖర్ రెడ్డి,పగడాల నాగరాజు,రామకృష్ణారెడ్డి,మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్,మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది,తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.