
పయనించే సూర్యుడు మే 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామపంచాయతీ ఎస్టీ కాలనీలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.రెవిన్యూ అధికారులు శుక్రవారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.ఎమ్మార్వో బి.మురళి మాట్లాడుతూ,ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని,నష్టంపై నివేదిక రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ శాఖలతో,ముఖ్యంగా హౌసింగ్ శాఖతో మాట్లాడి పక్కా గృహాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.తక్షణ సహాయంగా మూడు బాధిత కుటుంబాలకు రూ.5000 నగదు,నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సహాయ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.