
రుద్రూర్, జనవరి 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :- జంతు సంక్షేమ పక్షోత్సవంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో బుధవారం పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ఇందులో భాగంగా 15 పెంపుడు కుక్కలకు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సాయిరాజ్, వైద్య సిబ్బంది గంగారాం, పెంపుడు కుక్కల యజమానులు పాల్గొన్నారు.