——–మంత్రులు బాలవీరాంజనేయస్వామి, ఫరూక్ తో మంత్రి సవిత
పయనించే సూర్యుడు జనవరి 29 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా
పెనుకొండ … అమరావతి..మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎన్ఎండీ ఫరూక్ ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో మంత్రులను కలిసి పెనుకొండలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులపై ఆమె చర్చించారు. పెనుకొండ నియోజక వర్గంలో పలు సమస్యల పరిష్కారానికి మంత్రుల దృష్టికి మంత్రి సవిత తీసుకెళ్లారు. పెనుకొండతో పాటు నియోజక వర్గంలో అయిదు మండలాల్లోనూ అంబేద్కర్ భవనాలు నిర్మాణ విషయమై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. నియోజక వర్గంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనతో మరమ్మతులు చేపట్టాని తెలిపారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తోనూ మంత్రి సవిత భేటీ అయ్యారు. పెనుకొండలో షాదీ ఖానా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజక వర్గంలో పలు సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యమివ్వాలని ఫరూక్ ను మంత్రి సవిత కోరారు. ఈ భేటీలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.