
పయనించే సూర్యుడు జనవరి 29 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు పట్టణ కేంద్రంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి ఉత్సవాల జాతర సందర్భంగా
వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా పట్టణ స్థానిక ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి సిబ్బందితో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వనపర్తి పెబ్బేరు రోడ్డులో జాతర జరుగుతున్నందున ఎస్సీ కాలనీ వద్ద ఉన్న బ్రిడ్జి నుంచి జర్నలిస్టు కాలనీ, సంత మీదుగా దారిని మళ్లించారు. అందుకు సంబంధించి ఎస్సై హరిప్రసాద్ బ్రిడ్జి వద్ద, సుభాష్ చౌరస్తా వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై చెప్పారు. ప్రజలు దీనిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆ దారి గుండా గుంతలు ఏర్పడటంతో మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబు దగ్గరుండి మరమ్మతులు చేయించారు.