
పయనించే సూర్యుడు. 18… స్థానిక జయముకి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు అనగా 18-01-2025 శనివారం రోజున కళాశాల ఆవరణలో స్థానిక చెన్నారావుపేట పోలీస్ డిపార్ట్మెంట్రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.వరంగల్ నగర పోలిస్ డిపార్ట్మెంట్ నుండి చెన్నారావు పేట ఎస్ ఇ శ్రీ రాకేష్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, రోడ్డు పై సురక్షితంగా ప్రయాణించడానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను విద్యార్థులకు తెలియజేశారు.
పాదచారుల రోడ్డు దాటడంప్రయాణించే సమయంలో మాత్రమే జెబ్రా క్రాస్‌కి చేరుకుని, రోడ్డు దాటాలి.
ఎక్కడి నుండి వస్తున్న దారిలో సరైన దిశలో మాత్రమే జాగ్రత్తగారోడ్డుదాటండి.హెల్మెట్ ధరించాలి
- స్కూటర్ లేదా బైక్ ప్రయాణం చేస్తే హెల్మెట్ ధరించాలి.
- హెల్మెట్ వినియోగం వల్ల గాయాలు నివారించవచ్చు.
సిగ్నల్స్ పాటించండి - ట్రాఫిక్ లైట్స్, రోడ్డు సంకేతాలు, మరియు సిగ్నల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు.
పదునైన తీయే డ్రైవింగ్ నుంచి తప్పండివేగవంతమైన డ్రైవింగ్, ఒత్తిడి ఉన్న చోట తొందరగా వెళ్లడం ప్రమాదకరమైంది.
ప్రాపర్ బ్రేకింగ్ డిస్టెన్స్ కలిగి, సడలించి డ్రైవ్ చేయడం ఉత్తమంస్మార్ట్ ఫోన్ ఉపయోగం తగ్గించండిరోడ్డు మీద అందరి దృష్టిలో ఉండడం చాలా ముఖ్యమైంది. సెల్‌ఫోన్ ఉపయోగం చేసేటప్పుడు రోడ్డుపై దృష్టి కోల్పోవడం ప్రమాదాన్ని తేవవచ్చుప్రమాదాలపట్ల జాగ్రత్తగా ఉండండి సడన్ బ్రేకింగ్ లేదా ఇతర వాహనాలు అడ్డుగా రావడం వల్లదుర్ఘటనలుసంభవించవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండికళాశాలయాజమాన్యం శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోడ్డు భద్రత పెంచేందుకు అన్ని వర్గాల వారు జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులు, పిల్లలు, టీనేజర్లు సహా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి గమ్యస్థలాన్ని క్షేమంగా చేరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఓ ఎస్ డి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వీ జానకీ, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి శ్రీనివాసరావు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ హమీద్ పాషావివిధ విభాగాల అధిపతులు, ఫిజికల్ డైరెక్టర్ వెంగల్ రావు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు