
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కొందుర్గ్ మండలంలో 1.47 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని రేగడి చిల్కమర్రి గ్రామంలో సి.ఆర్.ఆర్ ఎస్సీ ప్లాన్ క్రింద 15.00 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు పనులకు, 6.0 లక్షల డీఎంఎఫ్టి నిధులతో నిర్మించే సీసీ రోడ్డు, ఏస్.డీ.ఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా అదేవిధంగా ఉత్తరాస్ పల్లి గ్రామంలో డిఎంఎఫ్టి నిధులు 6.0 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూట్ పూర్ గ్రామంలో సి.ఆర్.ఆర్ ఎస్సీ ప్లాన్ క్రింద 7.00 లక్షలతో సిసి రోడ్డు 3.00 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొందూర్గ్ మండల కేంద్రంలో 20.00 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి, చిన్న ఎల్కి చెర్ల గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పది లక్షల తో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా 50.00 లక్షల ఏస్.డీ.ఫ్ వీధులతో చిన్నలికిచెర్ల నుంచి మొగలిగిద్ద వరకు రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. గంగన్న గూడ గ్రామంలో FDR నిధులు 41.00 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం వలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని, గ్రామాలలో అభివృద్ధితో పాటు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలను ప్రారంభించా మని మిగతా వాటిని కూడా దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు.రేగడి చిలకమర్రి నుండి రామచంద్రపురం వరకు బిటి రోడ్డు ను కూడా తొందరలో మరమ్మత్తుల పనులు మొదలు పెడతామని అలాగే మధ్యలో కల్వర్టులకు సంబంధించి సుమారు మూడు కోట్ల వరకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. టేకులపల్లి బ్రిడ్జి, లాలాపేట బ్రిడ్జి, కొందుర్గు ఉమ్మెంతాల రోడ్డు, ముఖ్యమైన రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.