
పయనించే సూర్యుడు జనవరి 17హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
హుజురాబాద్ పట్టణంలో నివసిస్తున్న ఒక్క ప్రైవేటు ఉద్యోగి తన ఆవేదన తనకు పెళ్లి జరిగి మూడేళ్లు అవుతుంది. ఒక పాప ఉంది, ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమం లో రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్న. అధికారులు మాత్రం జాబితాలో తన పేరు రాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు కేవలం రూ 12 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు రేషన్ కార్డు రాకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని తనఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.