- ఎవ్వరు అధైర్య పడొద్దు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
- ములుగు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చిచ్చడిరాఘవులు.
వాజేడు: పయనించేసూర్యుడు: ఫిబ్రవరి 01: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చిచ్చడి రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకి అందజేససే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. ములుగు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చిచ్చడి రాఘవులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలియజేశారు అంతేకాకుండా ఫిబ్రవరి మూడో తారీకు నుండి ప్రతి రైతుకు రైతు భరోసా మరియు సంక్షేమ పథకాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలియజేశారు ఎవరు అధైర్య పడకుండా ఉండాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడే మాటలను గమనించాలని కేవలం వారు వారి యొక్క ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు తప్పుడు ప్రచారాలు ప్రజలకు అందిస్తున్నారని తెలియజేశారు. ఇకనైనా ప్రజలు మేల్కొని టిఆర్ఎస్ లాంటి దొంగపార్టీ నాయకుల ముచ్చట్లు నమ్మొద్దని అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పత్రికా ముఖంగా ప్రజలకు సూచించారు.